Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసిఐ నాగరాజు అరెస్ట్..

సిఐ నాగరాజు అరెస్ట్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎపిలో రాజకీయ దుమారం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లాకప్‌ డెత్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం విజయవాడలోని సింగ్ నగర్ లో నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో అతడి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సిట్‌ అధికారుల బృందం నాగరాజు ఇంటికి వెళ్లడంతో అనుచరులు భారీగా అక్కడకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టి నాగరాజను పోలీస్‌ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. నాగరాజుపై అక్రమ నిర్బంధం, హత్యాయత్నం, ఇతర అభియోగాల కింద కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -