నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలంలోని ధన్వాడ-గుమ్మళ్ళపల్లి గ్రామాల మధ్యలో గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఓ యువకుడిపై కత్తులతో దాడికి పాల్పడిన సంఘటన మంగళవారం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ పై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారని చెప్పారు. ఈ క్రమంలో త్రీవ భయాందళనలకు గురైన గణేష్ బిగ్గరగా కేకలు వేయడంతో పంటపొలాల్లో ఉన్న మేము (రైతులు) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. ఈ దాడిలో గణేష్ ఛాతిపై తీవ్ర గాయమైందని వెల్లడించారు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో భూపాలపల్లి వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. అనంతరం సమాచారం అందుకున్న కాటారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



