నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
నిన్నటి వరకు నిప్పుల కుంపటిని తలపించిన ఎండలతో అల్లాడిన ప్రజలు ఆదివారం, సోమవారం రాత్రి కురుస్తున్న తొలకరి జల్లులతో కాస్త ఉపశమనం పొందారు. సోమవారం నుండి ‘ఆరుద్ర కార్తె’ ప్రారంభం కావడంతో గ్రామాల్లో అక్కడక్కడ ఆరుద్ర పురుగులు దర్శనమిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని వ్యవసాయ పనుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆరుద్ర కార్తెలో తొలకరి జల్లులు కురుస్తుండడంతో రైతులు దుక్కులు దున్నడానికి సిద్ధమవుతుండగా.. బోర్లు కింద రైతులు విత్తనాలు విత్తడానికి సమాయత్తమవుతున్నారు. ఆరుద్ర కార్తెలో వర్షాలు పడగానే మట్టిలోంచి ముదురు ఎరుపు రంగులో ఉండే ఆరుద్ర పురుగులు బయటకు వస్తాయి. వీటివల్ల పంటలకు ఎలాంటి హాని చేయకుండా ఎండల తీవ్రత తగ్గి, భూమి చల్లబడి రుతుపవనాలు ఊపందుకుంటాయని రైతులు నమ్ముతారు. వ్యవసాయ ఆధారిత జీవితంలో ఈ కార్తెకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
రైతు నేస్తం.. తొలకరి జల్లుల్లో ఆరుద్ర సందడి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



