పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీఐ 

ఇంచార్జ్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన లింగారెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
రాయపర్తి పోలీస్ స్టేషన్ ను శనివారం నూతన సిఐ సూర్య ప్రకాష్ సందర్శించారు. స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారక్, టెక్నికల్ రూమ్, సీసీ కెమెరాలను పరిశీలించారు. విధి నిర్వహణలో తీసుకునే జాగ్రత్తలు గురించి పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. తదుపరి ఇంచార్జ్ ఎస్ఐగా ఎం లింగారెడ్డి విధుల్లో చేరారు. సిబ్బంది సీఐ, ఎస్సైలకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సదానందం, హెడ్ కానిస్టేబుల్ సురేష్, ఎల్లయ్య, రవీందర్, కానిస్టేబుల్స్ తూల సంపత్ కుమార్, కత్తుల శ్రీనివాస్, మహేందర్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love