దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ అర్జున్

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం ఎన్ హెచ్ ఎం స్కీం కు అధిక నిధులు కేటాయించి ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలి అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు.  మంగళవారం మండల పరిధిలోని వినాయకపురం గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశ వర్కర్ల సమావేశంలో భారతి, సమతా అధ్యక్షతన జరిగాయి. తక్షణమే ఆశ వర్కర్లకు  వేతన బకాయి లు చెల్లించాలని, వేతనాలు పెంచాలని ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిన్నె నాగమణి,రాధా చిలకమ్మా, వెంకటమ్మ,రవణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love