కార్మిక ఐక్య ఉద్యమాల సారధి సీఐటీయూ: కల్లూరి మల్లేశం

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
కార్మిక వర్గ ఐక్య ఉద్యమాల సారథి, పోరాటాల దిక్సూచి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) అని ఆ సంఘం జిల్లా  కార్యదర్శి కల్లూరి మల్లేశం తెలియజేశారు. గురువారం, సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 1970 మే 30న  పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఆవిర్భవించిందని నాటినుండి కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా నేటి వరకు 22 సమ్మెలు జరిగాయని కోట్లాదిమంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు అని తెలియజేశారు. 1991 లో నాటి ప్రధాని  పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి  మన్మోహన్ సింగ్  ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలు దేశ ప్రజలకు తీవ్ర నష్టం చేశాయని తెలియజేశారు. వాజ్పేయి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మరింత స్పీడ్ గా నూతనర్దిక విధానాలను అమలు చేసిన ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని, నిత్యవసర ధరలు  రోజు రోజుకు పెరుగుతున్నాయని, 29 కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చారని  విమర్శించారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఎఫ్ షరతులకు లోబడి దేశాన్ని అమ్మకానికి పెట్టారని ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆధునిక కార్మిక వర్గం పై ఉందని ఐక్యంగా మరిన్ని ఉద్యమాలకు సిద్ధం కావలసిన గురుతరమైన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఆరు లక్షల కోట్లు అర్జించాలని టార్గెట్గా నిర్ణయించుకుందని విమర్శించారు. కార్మికుల కనీస హక్కుల గురించి చట్టాల గురించి ఏనాడు ఆలోచించండి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ యజమాన్యాల కోసం 10 లక్షల కోట్ల  బకాయిలను మాఫీ చేసిందని విమర్శించారు. 54వ ఆవిర్భావ  దినోత్సవ సందర్భంగా ప్రీమియర్ ఎక్స్ప్లోసిస్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ పుప్పాల గణేష్ సిఐటియు జెండాను ఆవిష్కరించారు . యాదగిరిగుట్ట పట్టణంలో కొబ్బరికాయ హమాలీల్ అధ్యక్షుడు కంబాల స్వామి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ సత్యనారాయణ, యూనియన్ నాయకులు బి వెంకటయ్య, మంగ వెంకటేష్, నగేష్, గంగయ్య, కొబ్బరికాయ మాలి సంఘం జనరల్ సెక్రెటరీ చుక్కల పెద్ద వెంకటయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love