కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెడుతోంది: కల్లూరి మల్లేశం

– విచ్ఛిన్నకర, మతోన్మాద బీజేపీ, బీజేపీ పార్టీలను ఓడించండి
– ఉద్యమాల సారథి సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ ను గెలిపించండి
– కల్లూరి మల్లేశం సీఐటీయూ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
138 సంవత్సరాల క్రితం ప్రపంచ  కార్మిక వర్గం పోరాడి ఎనిమిది గంటల పనిని  సాధించుకున్నదని నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాన్ని రద్దుచేసి 12:00 గంటలు చేసి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి   నేడుతున్నదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం విమర్శించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని బుధవారం, పెద్దకందుకూరు ప్రీమియర్ కంపెనీ, యాదగిరిగుట్ట పట్టణంలోని  కొబ్బరికాయ  హమాలి యూనియన్ ఆధ్వర్యంలో 138 వ మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మేడే అమరవీరుల సాధించిన ఎనిమిది గంటల పని విధానానికి తూట్లు పొడుస్తూ స్వతంత్రానికి పూర్వం నుండి కార్మిక వర్గం పోరాట సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి 12 గంటలు పనిచేయాలని కార్పొరేట్ యజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్  కోడులను తీసుకువచ్చిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కుని ప్రశ్నార్థకం చేస్తూ కార్మికుని హక్కులు భంగం కలిగించిందని విమర్శించారు. ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్ అని ఒక కొత్త విధానాలను మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్  ద్వారా తీసుకొచ్చిందని ఇవి అమలు అయితే సమస్త కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు నిత్యం పెంచుతూ కార్మికులకు నష్టం చేసే చట్టాలు తీస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భువనగిరి పార్లమెంట్లో పోటీ చేస్తున్న నిస్వార్ధ నాయకుడు  ఎండి జహంగీర్ ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ నరసింహులు, సీఐటీయూ జిల్లా నాయకులు బబ్బూరి పోశెట్టి జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూర్ సత్యనారాయణ, ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఉప్పాల గణేష్, నాయకులు చెక్క రమేష్, వెంకటయ్య, నగేష్, స్వామి, ఐలయ్య, రైతు సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి, నాయకులు షరీఫ్ హమాలీ యూనియన్ అధ్యక్షులు కంబాలస్వామి, నగేష్, రమేష్, వెంకటేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Spread the love