మధ్యాహ్న భోజన  కార్మికులకు రూ.10 వేలు వేతనం పెంచాలని: సీఐటీయూ

నవతెలంగాణ  – అశ్వారావుపేట
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రూ.10 వేలు వేతనం పెంచాలని,దశల వారీగా అనేక ఆందోళనలు  నిర్వహించినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో వంట కార్మికులు ప్రస్తావనే లేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు.మద్యహ్నబోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల ఇరవై నాలుగున ఇందిర పార్కు వద్ద ధర్నా ను విజయవంతం చేయాలని, సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని ఎంఈవో కార్యాలయం లో ఎంఈవో అందుబాటులో లేకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు పాల్గొన్నారు.
Spread the love