ఉద్యోగులు పనిచేసే చోట సోదరభావంతో మెలగాలి: సివిల్ జడ్జి శ్రీవాణి

– మహిళా హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మహిళలు పనిచేసే ప్రదేశాల్లో సోదరభవం, ఐక్యతతో కలసి పనిచేయాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి అన్నారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో icds శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా వేధింపుల అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తో కలసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణకు హక్కులు, చట్టాలు ఎన్నో ఉన్నాయని ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు పనిచేసే చోట సోదర భావం, ఐక్యతతో మెలగాలని మహిళలను వివిధ కారణాలతో వేధింపులు, అవమాన పరచడం చేయరాదని సూచించారు. బాధిత మహిళలు పనిచోసే చోట లైంగిక వేధింపులు ఉంటే మహిళ కమిటీలకు పిర్యాదు చేయాలని తద్వారా న్యాయం జరిగేలా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మహిళలను లైంగిక వేధింపులే కాకుండా ఇతర వేధింపులు కూడా పిర్యాదు ద్వారా అందిస్తే పతిష్కరిస్తామని తెలిపారు. అన్ని కార్యాలయాల్లో మహిళలపై జరిగే వేధింపులు వాటి పరిష్కారానికి సంబంధించిన వార్షిక నివేదికలు అందచేయాలని సూచించారు.జిల్లాలో లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మెరుగైన సర్వీస్ అందిస్తున్నామని మహిళలు వేధింపులు వలన మనోధైర్యం కోల్పోకుండా హక్కులు, చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిదంగా కుటుంబంలో పిల్లలకు చిన్నప్పటి నుండే నైతిక విలువలు నేర్పాలని ఎక్కడకూడా లింగ భేదం లేకుండా చూడాలని అన్నారు. తదుపరి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 1997 లో రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన విశాఖ కేసు పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దేశ స్థాయిలో మహిళలపై పనిచేసే చోట లైంగిక వేధింపుల పై చట్టాలు రూపొందించి అమలు అవుతున్నాయని ఈ సందర్బంగా గుర్తుచేశారు.మహిళ చట్టాలు, హక్కులు ఇతర అంశాలపై జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సత్యనారాయణ పిళ్ళై అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో జెడ్.పి సి.ఈ. అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, సి.పి.ఓ కిషన్, డి డబ్ల్యుు ఓ వెంకటరమణ, డిప్యూటీ సి.ఈ. ఓ శిరీష, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మహిళ కమిటీలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love