
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రోజు ప్రశాంతంగా 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించినట్లు, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు నీలారాణి,వైబి శ్యామలత లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు 480 మంది విద్యార్థులను అలర్ట్ చేయగా, అర్హత పరీక్షకు 443 మంది విద్యార్థులు హాజరయ్యారని. 37మంది విద్యార్థులు అనివార్య కారణాల వల్ల గైర్హాజరయ్యారని తెలిపారు. తమ పాఠశాలలో 92% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని శ్యామలత తెలిపారు.గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 384 మంది విద్యార్థులను అలర్ట్ చేయగా 347, మంది విద్యార్థులు ఈ రోజు పరీక్షకు హాజరయ్యారని,37 మంది విద్యార్థులు అనివార్య కారణాలవల్ల గైర్హాజులు కావడంతో తమ పాఠశాలలో 90 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు అని ప్రిన్సిపాల్ నీలారాణి తెలిపారు.సాధ్యమైనంతవరకు ఈ పరీక్షా ఫలితాలు అతి త్వరలో వెల్లడవుతాయని అన్నారు.