
తెలంగాణ యూనివర్సిటీ అకడమిక్ కన్సల్టెంట్లు గురువారం క్యాంపస్‌లోని వివిధ కళాశాలల తరగతులను బహిష్కరించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి బైటాయించి నిరసన, దర్నా నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించిన వివిధ వర్సిటీల అకడమిక్ కన్సల్టెంట్లను అరెస్ట్ చేయడాన్ని వారు నిరసించారు. జీవో నెంబరు 21ను వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కన్సల్టెంట్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.