సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి

– పవర్ కోసమే..పవర్ ప్లాంట్ అంటూ దుష్ప్రచారం.
– మండల బీఆర్ఎస్  అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
నవతెలంగాణ-తొగుట: ఆదివారం సాయంత్రం దుబ్బాకలో జరిగే సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పిలుపునిచ్చారు. తొగుట మండల పార్టీ కార్యాలయంలో  బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడుతూ దుబ్బాకతో సీఎం కేసీఆర్ తో ఎంతో అనుబంధం ఉందన్నారు.దుబ్బాకలో చదువుకున్న సీఎం కేసీఆర్ తోనే దుబ్బాక అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డి ఘన విజయం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ సభ కోసం గ్రామ గ్రామాన నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. పవర్ కోసమే పవర్ ప్లాంట్ నాటకం.. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని రఘునందన్ రావు నేడు ఎన్నికల్లో గెలవాలని ఊర్లు పోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.గతంలోనే నిండు అసెంబ్లీలో మంత్రి తన్నీరు హరీశ్ రావు తొగుట మండలంలో ఒక్క ఊరు, గుంట భూమి పోదని ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం నమ్మవద్దని గుర్తు చేశారు. జప్తిలింగారెడ్డి పల్లిలోని సబ్ స్టేషన్ లొకేషన్ లో గూగుల్ మ్యాప్ లో పవర్ గ్రిడ్ అని వొస్తే.. దాన్ని పట్టుకొని వేంకట్రావుపేట, లింగాపూర్, జప్తిలింగా రెడ్డి పల్లి, చందాపూర్, ఎల్.బంజేరుపల్లి, రాంపూర్, తొగుట, లింగంపేట తదితర ఊర్లు పోతాయని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఏదైనా నిర్మా ణం జరిగిన తర్వాతే గూగుల్ లో ఉంటుందని, సబ్ స్టేషన్ పెరు మీద పవర్ గ్రిడ్ అంటూ ఓట్ల కోసం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఊర్లు పోతున్నా యని ప్రాపగండ చేయడంతో ఆపదలో ఉన్నవారు కొంత భూమి అమ్ముకుందామంటే విలువ పడి పోవడంతో అమ్ము కోని పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఓట్లు వేయించుకొనే తహతు లేకనే ఊర్లు పోతాయని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దుష్ప్ర చారం చేస్తున్నారని మండల పార్టీ మాజీ అధ్య క్షుడు చిలువేరి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఒక్క ఊరు పోదని, ఉన్న పరంపొగు భూములకు సైతం పట్టా సర్టిఫికెట్ లు ఇస్తారన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆత్మ కమిటీ చైర్మన్ లక్కరసు ప్రభాకరవర్మ, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య, సర్పంచ్లు సిరినేని గోవర్ధన్ రెడ్డి, మెట్టు వరలక్ష్మి స్వామి, ఎంపీటీసీ వేల్పుల స్వామి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య,మండల యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love