- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వాహనదారులకు సీఎన్‌జీ ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. తాజా సవరణతో మంగళవారం (మే 26) సీఎన్‌జీ ధర కిలోకు మరో రూ. 2 మేర పెరిగింది. దీంతో రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధర రూ.83.09కి చేరింది. కేవలం 12 రోజుల్లోనే ధరలు పెరుగుదల నాలుగోసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో సహజ వాయువు ధరల పెరుగుదల, సరఫరా సమస్యల కారణంగా ఈ పెంపు జరిగిందని ఇంధన కంపెనీలు తెలిపాయి.
- Advertisement -



