అర్ధ నగ్నంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు ..

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం వింత ఘటన చోటు చేసుకుంది. తడ్కోల్  గ్రామపంచాయతీ పరిధిలోని రాజారాం దుబ్బకు బ్యాగరి గంగారాం (42)  గత కొన్ని ఏండ్లుగా తడ్కోల్ గ్రామపంచాయతీ వాటర్ మెన్ విధులు నిర్వహిస్తున్నారు. బ్యాగారి గంగారాం కు నిత్యం తన భార్య కొడుతుందని, భార్య చేసే చేష్టలకు నిరసనగా ఆదివారం సాయంత్రం  రాజారాం దుబ్బ నుండి బాన్సువాడ పోలీస్ స్టేషన్ వరకు అర్థనగ్నంగా నడుచుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. దీనితో బాన్సువాడ టౌన్ సీఐ కృష్ణ కేసు నమోదు చేసి అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిపారు.
Spread the love