నాగల్ గావ్ లోని రెండు కేంద్రాలలో సాముహిక సీమాంతాలు..

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగల్ గావ్ గ్రామములో రెండు అంగన్ వాడి కేంద్రాలలో సంయుక్తంగా సాముహిక సీమాంతాలు మరియు తల్లి పాల విశిష్టతను ఆవగాహన చేయడం జరిగిందని అంగన్ వాడి టీచర్లు అంజమని , పంచశీల పేర్కోన్నారు. ఈ సంధర్భంగా జీపీ కార్యదర్శి హరిష్ పాల్గోని మాట్లాడుతు గర్భిణిలు, బాలీంతలు తల్లి పాల విశిష్టతను , సాముహిక సీమంతాలు నిర్వహించడం వలన పేదలకు మహిళలకు తల్లిగారింట్లో నిర్వహించినట్టుందని అన్నారు. ముర్రపాలు ప్రాముఖ్యతను వివరిస్తుఆరు  నెలల వరకు ముర్రపాలు పట్టాలని, శిశువుకు వ్యాదినిరోదక శక్తి పెర్గుతుందని సూచించారు. అనంతరం గ్రామములో ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో  సూపర్ వైజర్ కరుణ, జేపిఎస్, రెండు కేంద్రాల టీచర్లు అంజమని , పంచశీల, ఆశాలు తదితరులు పాల్గోన్నారు.

Spread the love