డిఆర్డిఓ పిడి కాలిందినిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు

– అవినీతిపై ఆధారాలు ఉన్న పట్టించుకోని అధికారులు 
– కలెక్టర్, ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలి
– పిడిని వెంటనే సస్పెండ్ చేయాలి
–   సామాజిక కార్యకర్త కట్ట వెంకటేశం 
 నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ నిధులను పక్కదోవ  పట్టిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న  నల్లగొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని ఎం. కాలిందినిపై నల్లగొండ జిల్లా కేంద్రం శాంతినగర్ కు చెందిన సామాజిక కార్యకర్త కట్ట వెంకటేశం ప్రజాదర్బార్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. కాగా ఫిర్యాదు పై త్వరలో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్ నుండి గురువారం సామాజిక కార్యకర్త కట్ట వెంకటేశం కు రిప్లై వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఆర్డిఓ పిడి కాలిందిని విధుల నిర్వహణలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉందని తెలిపారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలకు సంబంధించిన కథనాలు వివిధ పత్రికలలో ప్రచురిత అయ్యాయని.. ఆధారాలతో సహా లిఖితపూర్వకంగాపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ  ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పిఆర్ అండ్ ఆర్డి ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎసిబి, సి.బి.ఐ, ఈ డి లకు ఫిర్యాదు చేసినా  ఎలాంటి చర్యలు లేవని విచారణ కూడా నిర్వహించలేదని ఆరోపించారు. అక్రమంగా డిప్యూటేషన్  పేరుతో జిల్లాకు వచ్చిన పిడి కాళిందిని డిఆర్డిఓ లో తిష్ట వేసి ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతుందని అన్నారు. ముఖ్యంగా బైరుసన్   సంస్థతో వ్యాపారాలను ఎస్ హెచ్ జి, వివో, ఎంఎస్ సభ్యులతో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పి మహిళా సంఘాల మోసం చేసినట్లు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల అండదండతో ఇష్ట రాజ్యాంగ వ్యవహరించిందని ఆరోపించారు. జిల్లా మహిళా సమైక్యకు సంబంధించి 14, 72, 576 రూపాయలను తన సొంత ఖాతాలోకి మళ్ళించిందని తెలిపారు. విషయంపై సేర్ఫ్ డైరెక్టర్ స్థాయి అధికారి విచారణ చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.అధికారులు పిడి అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడంతో  అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే  ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. అవినీతికి సంబంధించి మరింత సమాచార కోసం ఆర్టిఐ ద్వారా కోరినట్లు తెలిపారు. ఇప్పటికైనా విషయంపై రాష్ట్రస్థాయి ఉన్నత అధికారి ని నియమించి విచారణ చేయించాలని తగిన ఆధారాలు ఉన్నందున వెంటనే సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి తో పాటు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Spread the love