
మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆత్మస్థైర్యం కోసం ప్రారంభించిన కరాటే శిక్షణ శిబిరం గురువారంతో ముగిసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న తెలిపారు. గత సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన మార్షల్ ఆర్ట్స్ కరాటే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపిరిసి పోటీలలో పాఠశాల విద్యార్థినిలు లోలకు భవాని తమ్మల్ల పెళ్లి రిషితలు ద్వితీయ స్థానాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కరాటే శిక్షణ కార్యక్రమంను శిక్షకులు అవినాష్, శివానిలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ కరాటే లో మంచి శిక్షణ ఇచ్చిన శిక్షకులను ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సాయన్న, ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.