Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

- Advertisement -

– ప్రతి గ్రామ అవసరాన్ని గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలి
– జీపీడీపీ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్లు, జలసిరిపై ప్రత్యేక దృష్టి
– కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి
: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి గ్రామ పంచాయతీల స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా, మండల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ సమగ్ర ప్రణాళికలో భాగంగా మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ, పచ్చదనం, విద్య, ఆరోగ్యం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో అవసరాలను గుర్తించి అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో ప్రజల అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి అభివృద్ధి పనికి స్పష్టమైన లక్ష్యం, ప్రాధాన్యత, కాలపరిమితి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ శాఖల పథకాలను సమన్వయం చేసుకుని గ్రామాల అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి,  గ్రామాల్లో తడి, పొడి చెత్తను ఇంటి స్థాయిలోనే వేరు చేసి సేకరించే విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్య సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి దశలో పురోగతిని పరిశీలించి లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని,  ప్రతి చుక్క వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచే విధంగా జలసిరి కార్యక్రమాన్ని గ్రామాల్లో విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, నీటి వృథాను అరికట్టడం, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు గ్రామస్థులను భాగస్వాములను చేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను శాఖల మధ్య సమన్వయంతో, పారదర్శకంగా, నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి, డీఆర్డీఓ దామోదర్ రెడ్డి, డీపీఓ మురళి, సీఈఓ చందర్, ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -