కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష పారదర్శకంగా జరపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని యన్.ఐ.సి. సెంటర్ నందు జిల్లా లోని వివిధ శాఖలకు చెందిన జూనియర్ అసిస్టెంట్ లకు నిర్వహించిన కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ పరీక్షకు 54 మందికి గాను 38 మంది హాజరు అయ్యారని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, ఈ డి ఎం గఫార్,అర్షద్, లావణ్య, క్రాంతి,తదితరులు పాల్గొన్నారు.