
కామ్రేడ్ చెల్ల మురళి సంతాప సభను విజయవంతం చేయాలని ప్రజలకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జే పి గంగాధర్ పిలుపునిచ్చారు. బుదవారండిచ్ పల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ జిల్లా మురళి సంస్మరణ సభ ను పురస్కరించుకుని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 ఏప్రిల్ సాయంత్రం 6 గంటలకు కామ్రేడ్ చెల్ల మురళి సంతాప సభను శ్రామిక నగర్ బోర్గం పి నిజామాబాద్ లో నిర్వహిస్తున్నమని వివరించారు. కార్మికు ఉద్యమ నాయకుడు కామ్రేడ్ జిల్లా మురళి ఏప్రిల్ ఒకటిన మరణించారు. అనారోగ్యం వలన నాలుగున్నర దశాబ్దాలు కార్మిక ఉద్యమంలో పనిచేసిన కామ్రేడ్ చెల్ల మురళి 1975 ప్రెస్ కార్మికుడిగా పనిచేస్తూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం సంఘం నిర్మాణం చేసి కామ్రేడ్ మల్లేష్ అన్న శిష్యుడుగా అనేక ఉద్యమాలు చేసి విస్సు కార్మికుల కోసం పోరాటాలు సలిపినాడు నిజామాబాద్ నగరంలో పీడిత ప్రజల కూడు కూడా నీటి వసతులపై ప్రజల్లో అందరికీ ప్రజలు అందరికీ నాయకత్వం వహించాడు బీడీ హమాలి ప్రెస్సు భవన నిర్మాణ కార్మికులకు, పేదలకు నాగారం ప్రాంతంలో నివాస స్థలాలను ఇప్పించుటలో కామ్రేడ్ మురళి కృషి మరువలేనిదని పేర్కొన్నారు. కార్మిక సంఘాలను నిర్మాణం చేస్తూ అంచలంచెలుగా ఎదిగి ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసి ఈనాడు సమాజంలో వ్యక్తిగత స్వార్థం వ్యక్తిగత లాభం కోసం మాత్రమే పనిచేయాలనే ధోరణి పెరిగిందని, ప్రభుత్వాలు మతాల పేరుతో కులాల పేరుతో ప్రజలను విభజించి పాలన చేస్తున్నాయని అన్నారు. పేదలకు తాత్కాలిక విభజన ఉపశమనాలు మాత్రమే కల్పించి వారిని ఎప్పుడు నిరుపేదలుగా జీవించే విధానాలే అమలు చేస్తున్నారని వాపోయారు. ప్రజల హక్కుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి అమరుడైన కామ్రేడ్ చెల్ల మురళి సంతాప సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కరపత్రం ఆవిష్కరణలో కామ్రేడ్ భారతి, లక్ష్మి, స్వప్న, లలిత ,లావణ్య, రాణి పాల్గొన్నారు.