యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’తో హీరో శ్రీ విష్ణు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. 1992 నాటి ఆంధ్ర-ఒడిశా సరి హద్దు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో మహిమ నంబియార్ కథానాయిక.
చిత్ర బృందం శనివారం ఈ సినిమాలోని మొదటి పాట ‘ఒరియా పిల్ల’ను లాంచ్ చేశారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ,’ ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక పీరియడ్ సినిమా. 90 లో జరిగిన సంఘటనలు ఆధా రంగా తీసుకుని, దానికి ఫిక్షన్ జోడించి కోన వెంకట్ ఒక అద్భుత మైన కథతో నా దగ్గరకు వచ్చారు. ఈ సినిమాకు అద్భుతమైన టెక్నీషి యన్లు పనిచేశారు. చిత్రీకరణలో ఎక్కువ భాగం అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. విజయ్ బుల్గా నిన్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాలోని నాలుగు పాటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందరూ సులభంగా పాడుకునేలా, గుర్తుపెట్టుకునేలా ఉన్నాయి. భాస్కరభట్ల సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంటుంది. శ్రీకాంత్ తో చేసిన ప్రతి సినిమా విజయవంతమైంది. షైన్ టామ్ చాకో చాలా ఎనర్జీ ఉన్న యాక్టర్. ఈ సినిమాకి ఆయన సహకారం చాలా పెద్ద ప్లస్ అయింది. ఆయన వల్ల ఎన్నో అద్భుతమైన లొకేషన్లు దొరికాయి. ఈ సినిమా కోసం ఒక కొత్త లాంగ్వేజ్ మాట్లాడాను. అది మీరు స్క్రీన్ మీద చాలా ఎంజాయ్ చేస్తారుఅని తెలిపారు. 'ఈ పాట చూస్తున్నంతసేపు నాకు ఒక ప్రత్యేకమైన తృప్తి కలిగింది. ఈ సినిమా విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేము రికార్డ్ చేసిన మొదటి పాట కూడా ఇదే. ‘ఒరియా పిల్ల’ అనే పదంతో పాట చేయాలనే ఆలోచన కూడా నాదే. విజయ్ ఆ ఆలోచనను అద్భుతంగా మ్యూజికల్ రూపంలో అందించాడు. భాస్కరభట్ల ఈ పాటలో ‘అదృష్టం చెంచాడు’ అని రాశారు. కానీ ఈ సినిమాలో అదృష్టం చెంచాతో కాదు, బకెట్ల కొద్దీ ఉంది. ఈ చిత్రంలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ నటిస్తోంది. జానకిరామ్ చెప్పిన ఐడియా నాకు చాలా నచ్చిం ది. ఆ తర్వాత ఒక్కో అంశాన్ని జోడిస్తూ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించాం అని రచయిత, నిర్మాత కోన వెంకట్ చెప్పారు.
సరికొత్త నేపథ్యంలో ‘కామ్రేడ్ కళ్యాణ్`
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



