పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘హ్రీం. సుజాత మల్లాల సమ ర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు. హర్రర్, మిస్టికల్ థ్రిల్లర్ స్టోరీతో దర్శకుడు రాజేష్ రావూరి రూపొంది స్తున్నారు. శనివారం ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. నిర్మాతగా శివ మల్లాల ప్యాషన్ తెలుస్తోంది. ఆయన ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకుని మరిన్ని పెద్ద చిత్రాలు నిర్మించాలి అని తెలిపారు.
‘ఈ సినిమాకు పేరు హ్రీం అయినా క్రీమ్ లా అనిపిస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాఅని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ,'మా శివ ప్రొడక్షన్ లో నష్టపోడనే ధైర్యం, నమ్మకం నాకు ఉన్నాయి. ఎందు కంటే అతనికి ఆ పరిజ్ఞానం, లౌక్యం ఉంది అని అన్నారు.
‘నాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చిన శివ మల్లాలకి థ్యాంక్స్. ఆయన ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయితే నాలాంటి కొత్తవాళ్లు మరికొందరికి అవకాశం ఇస్తారుఅని డైరెక్టర్ రాజేష్ రావూరి చెప్పారు. ప్రొడ్యూసర్ శివ మల్లాల మాట్లాడుతూ, 'దాదాపు 25 ఏళ్లుగా జర్నలిజం కెరీర్ కొనసాగిస్తున్నాను. ఇప్పుడు నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాను. సినిమా అంటే సమష్టి కృషి. మనం ప్యాషనేట్ గా ఉంటే సినిమాకు వచ్చే ఏ అడ్డంకి అయినా దాటడం సులువే. ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు మా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ గా ఎంకరేజ్ చేశారు. డైరెక్టర్ రాజేష్ కర్ణపిశాచి అనే కథ చెప్పాడు. ఆ కథ విన్నప్పుడు అందులోని కోర్ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఈ కథ గురించి నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, సతీష్, శైలజకి చెప్పాను. వాళ్లు కూడా ఈ కథ విని ఎగ్జైట్ట్ ఫీలయ్యారు. మా డైరెక్టర్, డీవోపీ గెరిల్లా టైప్ లో షూట్ చేసి మంచి ఔట్ పుట్ ఇస్తామని చెప్పడంతో నేను ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందు కొచ్చాను. రాజీవ్ కనకాల, బెనర్జీ గారు, భద్రమ్..ఇలా చాలా మంది సపోర్ట్ చేయడం వల్లే కాంపాక్ట్ బడ్జెట్ లో ఈ సినిమా చేయగలిగాం అని తెలిపారు.
‘హ్రీం`హిట్ ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



