Sunday, June 21, 2026
E-PAPER
Homeసినిమాకథని ముందుకు నడిపించే పాటలు

కథని ముందుకు నడిపించే పాటలు

- Advertisement -

వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ తమ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. శనివారం చిత్ర బృందం రెండో పాట ‘దేశ సంచారి’ని విడుదల చేసింది.
ఈ పాట ఆల్బమ్‌కు రెట్రో టచ్, విన్టేజ్ గ్లామర్‌ను తీసుకొచ్చే ప్రత్యేక గీతంగా నిలిచింది. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి అందించిన ఈ కంపోజిషన్ ఉత్సాహభరితమైన బీట్‌లు, ఆకట్టుకునే హుక్స్‌తో అదిరిపోతుంది. వింటేజ్ మాధుర్యాన్ని గుర్తు చేస్తూనే, నేటి ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ పాటను తీర్చిదిద్దారు.
రెహమాన్ అందించిన సాహిత్యం, హేమచంద్ర, ప్రియాంక గజానన్ పాడిన తీరు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి స్వరాలు పాటలోని విన్టేజ్ ఫీల్‌ను మరింత బలంగా ప్రజెంట్ చేశాయి. ఈ పాటలో ప్రధాన ఆకర్షణ విజువల్ ప్రెజెంటేషన్. భారీ స్థాయిలో రూపొందించిన పబ్ సెటప్‌లో సత్యదేవ్, హైడీ కరోలా శ్రవణ్ ముప్పిరి కొరియోగ్రఫీ చేసిన సాల్సా స్టయిల్ లో డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నారు. చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
సత్యదేవ్ మాట్లాడుతూ, ‘అందరికీ డ్యాన్స్ విషయంలో ఈ ఒక పాటే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంకో రెండు పాటలు కూడా ఉన్నాయి. నా కెరీర్ లోనే ఫస్ట్ టైం ఈ స్థాయిలో డ్యాన్సులు చేశాను. ఇది సాల్సా స్టయిల్ డ్యాన్స్. నా డ్యాన్స్ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాటకు ‘దేశ సంచారి’ అనే లైన్ చాలా చక్కగా కుదిరింది. ఇదే సమయంలో మహేష్ బాబు ‘వారణాసిసినిమాలో కూడా ‘సంచారి’ అనే పాట ఉండటం యాదృచ్ఛికంగా జరిగిందని భావిస్తున్నాను. ఈ సినిమాలో మొత్తం ఏడు గెటప్స్ ఉన్నాయి. అందులో నాకు చాలా ఇష్టమైనది రామప్ప గెటప్. అలాగే పాటలే మా కథని ముందుకు నడిపిస్తాయి అని తెలిపారు.
‘సత్య, నేను బ్రదర్స్‌లా ఉంటాం. సత్యకు ఏదైనా పెర్ఫార్మెన్స్ గురించి చెబితే, మనం ఏం కోరుకుంటామో దాన్ని అద్భుతంగా తెరపై చూపించగలడు. ఈ పాటలో సత్య డ్యాన్స్ చేస్తుంటే నేను మానిటర్ దగ్గర చాలా ఎక్సైట్ అయ్యేవాడిని. ఈ పాట కోసం ప్రొఫెషనల్ క్లబ్ డ్యాన్సర్ హైడీ కరోలాను ఎంపిక చేశాం. ఆమె చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది` అని దర్శకుడు వెంకటేష్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -