తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోందని దర్శకుడు, నటుడు షెరాజ్ మెహదీ ఆరోపించారు.
తన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’ విడుదల, రీ-రిలీజ్ సమయంలో ఎదురైన ఇబ్బందులపై ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నా సినిమా మీద మాత్రమే కాదు లో-బడ్జెట్ సినిమాల నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారు.
చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటు న్నారని షెరాజ్ ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు నష్టపోతున్నా యని ఆయన తెలిపారు.
హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చిన్న చిత్రాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు ఇస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లో కేటాయిస్తున్నారని తెలిపారు. దీని వల్ల సినిమాలు ప్రేక్షకుల దృష్టికి చేరకముందే విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతోం దని, థియేటర్లతో పాటు ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, ఓటీటీ ప్లాట్ ఫార్ములు, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నాయని ఆయన చెప్పారు. దీంతో కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని షెరాజ్ తెలిపారు.
‘ఓ అందాల రాక్షసి’ సినిమా చాలా బాగా వచ్చిందని ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. అంత హిట్ సినిమాను కూడా ఇండస్ట్రీ పెద్దలు రానివ్వడం లేదు. ఈ సమస్యపై ఫిల్మ్ చాంబర్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదు. భరత్ భూషణ్ మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుం టారని ఆశిస్తున్నాను. థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యా యంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీ సులు పంపినట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు సబ్సి డీలు అందుతున్నాయి. మన దగ్గర కూడా అందితే చిన్న సినిమాలు బతుకుతాయి అని అన్నారు.
చిన్న సినిమాలను బతికించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



