Sunday, June 21, 2026
E-PAPER
Homeసినిమామా 'బాలన్`మరోమారు నిరూపించాడు

మా ‘బాలన్`మరోమారు నిరూపించాడు

- Advertisement -

కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలిం స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘బాలన్ – ది బాయ్. 'ఆవేశం ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో ‘మంజుమ్మెల్ బాయ్స్చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహించారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా హిందీతో పాటు మల యాళం, తెలుగు, కన్నడ, తమి ళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడి యోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ప్రొడ్యూసర్ శైలజా దేశాయి ఫెన్ మాట్లాడుతూ, 'తేస్పియన్ ఫిలింస్ లో మొదటి చిత్రమిది. నిర్మాతలుగా మాకు తొలి ప్రయత్నమైనా మమ్మల్ని డైరెక్టర్ చిదంబరం నమ్మారు. ఈ చిత్రంతో పాటు మేము హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో 'హైవాన్ అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాం. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ మాకు పూర్తి సహకారం అందిం చారు. మమ్మల్ని నమ్మినందుకు థాంక్స్అని అన్నారు. 'తెలుగు ఆడియెన్స్ సినిమాను సెలబ్రేట్ చేస్తారు. వారికి ఏ భాష సినిమా అనేది ఇంపార్టెంట్ కాదు. మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారు. అలాగే మా 'మంజుమ్మెల్ బాయ్స్ సినిమాపై ఎంతో ప్రేమ చూపిం చారు. ఇప్పుడు ఈ సినిమాపై కూడా అదే ప్రేమను చూపిస్తున్నారు. నేను, జీతు చూసిన అనేక రియల్ లైఫ్స్ ఆధారంగా ఈ కథను రెడీ చేసి, సినిమా తీశాం` అని డైరెక్టర్ చిదంబరం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -