Sunday, June 21, 2026
E-PAPER
Homeసోపతిరుతుపవనాలు ఎలా ఏర్పడతాయి?

రుతుపవనాలు ఎలా ఏర్పడతాయి?

- Advertisement -

రుతు పవనాలు.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వేసవి కాలం చివరి నాటికి ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకుంటారు. ముఖ్యంగా రైతులు ఇవి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తారు. టీవీల్లో, పేపర్లో కూడా ఈ పాయింట్‌ గురించే డిస్కషన్‌ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన కారణం రుతు పవనాలు. ఇంత ముఖ్యమైన? రుతు పవనాల గురించి చాలా మందికి పూర్తిస్థాయిలో తెలియదు.

రుతు పవనాలు అంటే ఏమిటి : రుతు పవనాలు అంటే వర్షాన్ని ఇచ్చే శక్తి ఉన్న తాత్కాలిక పవనాలు. ఇవి కాలానికి అనుగుణంగా ఏర్పడతాయి. అంటే ఏడాది మొత్తం వీయకుండా కొన్ని రుతువుల్లో, కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయి. భూ, జలభాగాల మధ్య రుతువును అనుసరించి, దిశను మార్చుకుంటూ పవనాలు వీస్తుంటాయి. వివరంగా చెప్పాలంటే ఎండాకాలం అయిపోగానే, వానలు రావడానికి కారణమయ్యే గాలులనే ”రుతు పవనాలు” అంటారు. అంటే, ఒక ప్రాంతానికి వర్షాన్ని మోసుకొచ్చే ప్రత్యేకమైన గాలులు అన్నమాట.

ఆ పేరు వెనుక చరిత్ర
: రుతు పవనాన్ని ‘మౌసిమ్‌’ అనే అరబిక్‌ పదం నుంచి తీసుకున్నారు. మౌసిమ్‌ అంటే రుతువు అని అర్థం. రుతువు అంటే గాలులు దిశాత్మకంగా ఒక కాలం నుంచి మరొక కాలానికి మారడం. అరేబియా సముద్రంలో రుతువును అనుసరించి వచ్చే ఈ పవనాలకు క్రీ.శ. 7వ శతాబ్ద నావికులు ఈ పేరు పెట్టి ఉండొచ్చని శాస్త్రజ్ఞుల అంచనా.

ఎన్ని రకాలు: భారతదేశంలో ప్రధానంగా రెండు రకాల రుతుపవనాలున్నాయి. అవి నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాలు. ఎండాకాలం పూర్తయ్యాక అందరూ ఎదురుచూసేది నైరుతి రుతుపవనాల కోసం.

నైరుతి రుతుపవనాలు: భూమిపై గాలి వేడెక్కి వాతావరణంలో కలుస్తుంది. ఆ గాలి సముద్రం వైపు వీస్తుంది. అదే సమయంలో సముద్రంలోని నీరు కూడా ఆవిరై గాలిలో కలుస్తుంది. ఈ కారణంగా గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీంతో గాలి వీచే దిశ మారుతుంది. తేమగా ఉన్న ప్రాంతం నుంచి ఉష్ణ ప్రాంతం వైపు ఆ గాలి మళ్లుతుంది. అంటే.. సముద్రం నుంచి భూమిపైకి గాలులు వీస్తాయి. ఫలితంగా తేమతో కూడిన గాలి కాస్తా ఘనీభవించి వర్షంగా కురుస్తుంది. నైరుతి నుంచి భారతదేశం వైపు ఈ గాలులు వీస్తాయి కాబట్టి వీటిని నైరుతి రుతుపవనాలు అంటారు. భారతదేశంలో వర్షాకాలం నైరుతి రుతుపవనాలతోనే ప్రారంభమవుతుంది. అధిక వేడి, అధిక తేమ, అధిక వర్షపాతం ఈ కాలం లక్షణాలు. దేశంలో దాదాపు 80 శాతం వర్షపాతం ఈ కాలంలోనే సంభవిస్తుంది. ఈ రుతు పవనాలు జూన్‌ మొదటి వారంలో ప్రవేశించి, జులై నాటికి దేశమంతా విస్తరిస్తాయి.

ఈశాన్య రుతుపవనాలు: ఇవి శీతాకాలంలో వస్తాయి. అక్టోబర్‌ లేదా నవంబరు మధ్యలో ప్రారంభమై డిసెంబరు, జనవరి నాటికి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ కాలంలో దేశ వాయవ్య భాగంలో అధిక పీడనం ఏర్పడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -