Wednesday, July 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొరటాల సత్యనారాయణ వర్థంతి సభ (లైవ్)

కొరటాల సత్యనారాయణ వర్థంతి సభ (లైవ్)

- Advertisement -

కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ వర్ధంతి సభ హైదరాబాద్ లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయం ఎంహెచ్ భవన్ లో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విశ్లేషకులు ఎం కొటేశ్వర రావు హాజరుకానున్నారు.

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబరు 24న జన్మించిన కొరటాల 2006 జూలై ఒకటిన అనారోగ్యంతో మరణించారు. పూవు పుట్టగానే పరిమలస్తుందన్నట్లుగా అనుచితమైన డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా హైస్కూలులో జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించారు. తెలంగాణా సాయుధ పోరాట సమయంలోనూ, తరువాత 1975లో విధించిన అత్యవసర పరిస్థితిలో నాలుగేండ్లపాటు అజ్ఞాతవాసంలో ఉన్నారు. రైతు సంఘ రాష్ట్రనేతగానే కాదు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకునిగా కూడా ఆయన పనిచేశారు. ఎనభయ్యవ దశకంలో ప్రవేశించిన వ్యవసాయ పనుల కాంట్రాక్టు విధానం కార్మికులకు ఎలా నష్టదాయకమో కూడా ఆయన అధ్యయనం చేసి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -