Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సావర్గావ్ అంగన్‌వాడీలో పోషకాహార పంపిణీ

సావర్గావ్ అంగన్‌వాడీలో పోషకాహార పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల పరిధిలోని సావర్గావ్ గ్రామంలో బుధవారం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు బాలామృతం, చిన్నారులకు గుడ్లు, దుస్తులను గ్రామ సర్పంచ్ కపిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్‌వాడి కేంద్రంలో ప్రతిరోజూ వినియోగించే బియ్యం, పప్పులు మరియు ఇతర నిత్యావసర సరుకులను పరిశీలించి, వాటి నాణ్యత, నిల్వలు, పంపిణీ విధానాన్ని తనిఖీ చేశామని తెలిపారు.

అదేవిధంగా అంగన్వాడీ చిన్నారుల ఎత్తు, బరువులను పరిశీలించామని చెప్పారు. పిల్లలకు సమయానుసారం టీకాలు ఇస్తున్నారా లేదా టీచర్లను అడిగి తెలుసుకున్నామని, వీటికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశామన్నారు. పౌష్టికాహారం ప్రతి ఒక్కరికీ అందించాలని టీచర్లకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -