గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించండి 

నవ తెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం కోరారు. బుధవారం స్థానిక పన్నాల గూడెం క్యాంపు కార్యాలయంలో ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి విభాగాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు సవివరంగా వివరించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి నగరికంటి ఏసు పాదం, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి అంజలి యాదవ్, విద్యార్థి ఉద్యమ నాయకులు కొమ్మనబోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love