ఈనెల 16 నుండి సదస్సులు సమావేశాలు జరపాలి 

– సీపీఐ(ఎం) పార్టీ నిర్ణయం 
– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు 
నవతెలంగాణ – కంఠేశ్వర్
కేంద్ర బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులను కేటాయించాలని 16 నుండి 25 వరకు సదస్సులు సమావేశాలు జరపాలని సిపిఎం పార్టీ నిర్ణయం చేసినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగపడే విధంగా నిధులను కేటాయించలేదని ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను నిర్వహించే పేదలకు వ్యవసాయ కూలీలకు లక్షల కోట్లు కేటాయిస్తే తప్ప తగినంత ఉపాధి హామీ పనులు లభించవని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలను అమలు జరపటానికి నిధులను కేటాయించలేదని తెలంగాణ ప్రాంతానికి రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు నిధుల కేటాయింపు జరగలేదని రైతాంగాన్ని ఆదుకునే పద్ధతుల్లో గిట్టుబాటు ధరకు నిర్ణయం చేయలేదని జిల్లాకు కేటాయించిన పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించిన నిధులను కేటాయింపు జరపలేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సవరణలు చేయాలని అందుకు కేంద్ర మంత్రులుగా ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని అందుకొరకు ప్రజలను చైతన్యవంతం చేయటానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సదస్సులు చర్చ పోస్టులు సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుతారు అనుకూల బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ప్రజలను కదిలించటానికి ప్రయత్నం చేయాలని నిర్ణయించడం జరిగిందని అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఈనెల 16 నుండి 25వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో సదస్సులు చర్చాగోష్టులు సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్,నన్నే సబ్, ప్రజానాట్యమండలి నాయకులు సిరుప లింగం తదితరులు పాల్గొ న్నారు.
Spread the love