నవ తెలంగాణ-రాయపోల్ :
గజ్వేల్ ఏసిపిగా బాధ్యతలు స్వీకరించిన బాలాజీని ఎస్‌ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్బంగా సుల్తానా ఉమర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం దౌల్తాబాద్ ఎస్సైగా ఉద్యోగంలో చేరి అంచలంచలుగా ఎదుగుతూ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌గా ఎదగడం సంతోషకరమన్నారు. మునుముందు ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు, సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీఏ కులాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింలు, ఎస్‌ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, సూరంపల్లి తలారి నర్సింలు పాల్గొన్నారు.