వడదెబ్బతో హమాలీ కార్మికుడి మృతి

నవతెలంగాణ-దుబ్బాక రూరల్‌ వడదెబ్బతో హమాలీ కార్మికుడు ఎమ్మ వెంకటయ్య(45) మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మశాలి గడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని నర్లెంగడ్డలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇదే గ్రామనికి చెందిన ఎమ్మ వెంకటయ్య-ఉప్పలవ్వ దంపతులు.వత్తి రీత్యా హమాలీ కూలీ పనులు చేస్తుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి 4 గురు ఆడపిల్లలు సంతానం.. కాగా ఇద్దరి పిల్లల పెళ్లిళ్లు చేశారు.ఐతే గత కొన్నిరోజులుగా ఎండ తీవ్రంగా కొడుతుండటంతో పని ప్రదేశంలో వెంకటయ్య అస్వస్థతకు గురయ్యాడు.దీంతో సిద్దిపేట జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించగా గత వారం రోజుల నుండి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వెంకటయ్య కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love