అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

నవతెలంగాణ – దుబ్బాక: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్‌ పరిధి చెల్లాపూర్‌ గ్రామానికి చెందిన కంకనాల లక్ష్మయ్య(60) పొలంలో బోర్లు వేయడానికి, పంట పెట్టుబడి కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక బుధవారం ఉదయం పొలంలో చెట్టుకు ఊరేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మీరాసాహెబ్‌గూడెం గ్రామానికి చెందిన పర్నె నర్సిరెడ్డి(48) సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. అవి తీర్చలేనన్న ఆందోళనతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Spread the love