అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ దూరం

న్యూఢిల్లీ : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తాము హాజరుకావడం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. అది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పొలిటికల్‌ ప్రాజెక్ట్‌ అని వ్యాఖ్యానించింది. ‘మతం అనేది వ్యక్తిగత అంశం. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌/ బీజేపీ ఈ అయోధ్య రామాలయ అంశాన్ని పొలిటికల్‌ ప్రాజెక్టుగా మార్చాయి. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, రామభక్తుల మనోభావాలను గౌరవిస్తూ.. మర్యాదపూర్వకంగా ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం’ అని కాంగ్రెస్‌ వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.

Spread the love