అన్నారంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

నవ తెలంగాణ- రామారెడ్డి:  మండలంలో అన్నారం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి సల్మాన్ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీఆర్‌ఎస్‌ నాయకుల అభివృద్ధి మాత్రమే జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, మహమ్మద్ షబ్బీర్ అలీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఆ అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తుందని, కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యారంటీలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లని అన్నారు. కార్యక్రమంలో దయానంద్, నర్సింగరావు, కూడెల్లి ఎల్లం, శ్రీను, గోనె దేవరాజు, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.
Spread the love