పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది: ఆది శ్రీనివాస్

– నూకలమర్రి గ్రామం నుండి భారీ గా కాంగ్రెస్ పార్టీలో చేరిక..
– కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ 
పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామనికి చెందిన బీఆర్ఎస్ మండల నాయకులు రొమాల ప్రవీణ్, యాదవ సంఘనికి చెందిన మెడిదల పరుశరాములు,మెడిదల శ్రీనివాస్,పోట్ల మధు,ఏసుక్రీస్తు శిష్య బృందం బస రాజు ,రజక సంఘం చెందిన కొత్తకొండ రమేష్,దేవయ్య ,హమాలి సంఘానికి చెందిన సుంకపాక శంకరయ్య   సుమారు 200 మంది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీల చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నూకలమర్రి గ్రామనికి చెందిన వివిధ కుల సంఘ సభ్యులు,బీఆర్ఎస్ నాయకులకు ఘనస్వాగతం పలుకుతున్నాం అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్నా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయలన్నారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. పేద ప్రజలకు,ఎస్సి,ఎస్టీ,బీసీ లకు సంక్షేమ పథకాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే సాధ్యం అన్నారు.గత పది సంవత్సరాల బిఆర్ఎస్,బీజేపీ ప్రభుత్వల వలన కేంద్ర,రాష్ట్రలకు ఒరిగింది ఏమి లేదన్నారు.కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రంలో,దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు.
దేశంలో, రాష్ట్రంలో పేద ప్రజలకు కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రజా పాలనకు స్వీకారం చుట్టారని దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి  పేరుతో  అధికారంలోకి వచ్చిన గత పాలకులు  తెలంగాణ పదాన్ని దూరం చేసుకున్న నాడే ప్రజలతో పేగు బంధం తెగిపోయింది అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తుందని అన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రూరల్ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, ఎంపీటీసీ రంగు వెంకటేష్ గౌడ్ రోమాల ప్రవీణ్ తో పాటు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love