చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

నవతెలంగాణ – పెద్దవంగర
వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని చిన్నవంగర పంచాయతీ కార్యదర్శి గీతా అన్నారు. జన వికాస ఆధ్వర్యంలో, బొమ్మెర నగేష్ తన తల్లి జ్ఞాపకార్థం గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె సెంటర్ మేనేజర్ రమణా తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలు చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాల వికాస కో ఆర్డినేటర్ సరిత, పోస్ట్ మాస్టర్ మౌనిక, కారోబార్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love