Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్ని వర్గాలనూ మోసం చేసిన కాంగ్రెస్‌

అన్ని వర్గాలనూ మోసం చేసిన కాంగ్రెస్‌

- Advertisement -

మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలనూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మోసం చేసిందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ‌పాలనకు వెయ్యి రోజులు పూర్తవుతు న్నాయనీ, ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదని చెప్పారు. కానీ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌‌రావులపై సమయం దొరికి నప్పుడల్లా సీఎం రేవంత్‌‌రెడ్డి దాడి చేస్తున్నారని అన్నారు. రైతు డిక్లరేషన్‌, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌, యూత్‌ డిక్లరేషన్లను ఇచ్చి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మర్చి పోయిందన్నారు.
బుధవారం ప్రభుత్వం చార్జీషీట్‌ ‌విడుదల చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ‌బాకీ కార్డును ఇంటింటికీ పంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ ‌మాజీ చైర్మెన్లు చిరుమళ్ల రాకేశ్‌కుమార్‌, దామోదర్‌ ‌గుప్తా, టీజీపీఎస్సీ మాజీ సభ్యులు సుమిత్రానంద్‌, బీసీ కమిషన్‌ ‌మాజీ సభ్యుడు కె కిశోర్‌‌గౌడ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -