Friday, August 21, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకేతో కాంగ్రెస్ చర్చలు

టీవీకేతో కాంగ్రెస్ చర్చలు

- Advertisement -

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి 
కే.సీ వేణుగోపాల్
చెన్నై : తమిళనాడులో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. 108 స్థానాల్లో గెలిచినప్పటికీ మెజార్టీ మార్కు 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఏదో ఒకపార్టీతో టీవీకే జతకట్టాల్సి ఉండగా టీవీకేతో పొత్తు కు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాంగ్రెస్ తో టీవీకే చర్చలు జరుపుతుందని ఆయన మంగళవారం మీడియాకు లీకేజీలిచ్చారు.కాగా, కేసీ వేణుగోపాల్ అలప్పుజాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నిక ల్లో డీఎంకేతో కలిసి మేం పోటీ చేశాం. కానీ టీవీకేతో కాంగ్రెస్ చర్చలు ఇప్పుడు తమిళనాడులో కొత్త పరిస్తితి తలెత్తింది. ఈ సమయం లో కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది’ అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -