Wednesday, May 6, 2026
E-PAPER
Homeజాతీయంనేను రాజీనామా చేయను

నేను రాజీనామా చేయను

- Advertisement -

కుట్ర వల్లే ఓడిపోయాం :
టీఎంసీ అధినేత మమతా బెనర్జీ

కోల్ కతా: పశ్చిమబెంగాల్లో తాము బీజేపీతో పోరాడలేదని ఆ పార్టీ కోసం పని చేసిన ఎన్నికల సంఘంతో పోరాడామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఓటమి ప్రజాతీర్పు వల్ల కాదని.. కుట్ర కారణంగానేనని అన్నారు. ఫలితాల అనంతరం.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ తదితర నేతలు తనకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారన్నారు. ఇకపై ‘ఇండియా’ కూటమి బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. “ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ.. ఈవీఎంలను తారుమారు చేస్తూ.. సీఈసీ ఓ విలన్ లా మారింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో 80 నుంచి 90 శాతం చార్జ్ ఉంటుందా? అదెలా సాధ్యం? ఎన్నికలకు రెండ్రోజుల ముందు.. మా పార్టీ శ్రేణులను అరెస్టు చేయడం మొదలుపెట్టారు. అన్నిచోట్లా సోదాలు నిర్వహించారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారు లందరినీ మార్చేశారు. ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ గేమ్ ఆడింది. మేం అన్ని యంత్రాం గాలకు వ్యతిరేకంగా పోరాడాం. సర్ పేరిట 90 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. మేం కోర్టుకు వెళ్తే… 32 లక్షల పేర్లను చేర్చారు” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -