నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సుప్రీకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026ను పార్లమెంట్‌లో పెట్టే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కాకుండా ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 34-37 (కొత్తగా నలుగురు జడ్జీలు) పెంచడానికి వీలుకలుగుతుంది. న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో సుప్రీంకోర్టు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన న్యాయం అందించడానికి దోహదపడుతుందని కేంద్రం పేర్కొంది. ఈ సుప్రీంకోర్టు జడ్జీల నలుగురు జడ్జీలు, సహాయక సిబ్బంది జీతాలు, ఇతర సౌకర్యాలకు అయ్యే ఖర్చును భారత సంఘటత నిధి నుంచి కేటాయించనున్నారు. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 1960 చట్ట ప్రకారం గరిష్ట సంఖ్య 10గా నిర్ణయించారు. అనంతరం 1960 చట్ట సవరణతో ఈ సంఖ్యను 13కి, 1977 సవరణతో 17కి పెంచారు. అయితే సీజేఐ మినహాయించి.. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను కేంద్ర క్యాబినెట్ 1979 చివర్లో 15 మందికి పరిమితం చేసింది.
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 37కు పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



