రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

నవతెలంగాణ – నాంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మునుగోడులో తాను భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాంపల్లి మండలంలోని ఫకీర్ పురం, సుంకిశాల, బండ తిమ్మాపురం, ముష్టిపల్లి, రాజ్యా తండా, దేవత్ పల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కి ప్రజలు డప్పుల చప్పులతో, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ పున్న కైలాష్ నేత, నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి, పానగంటి వెంకన్న గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, ఎరెడ్ల రఘపతి రెడ్డి, పూల వెంకటయ్య, కత్తి రవీందర్ రెడ్డి, గజ్జల శివా రెడ్డి, శీలం జగన్ మోహన్ రెడ్డి, మండల సిపిఐ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Spread the love