Saturday, September 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గౌడ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలకు సన్మానం

గౌడ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ
మండల పరిధి నుంచి నూతనంగా కాంగ్రెస్‌ పార్టీలో పదవులు పొందిన నాయకులను బాల్కొండ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులు చాట్ల నరేష్‌, జిల్లా జనరల్‌ సెక్రటరీ యునుస్‌, జిల్లా సెక్రటరీ సంజీవ్‌ గౌడ్‌, బాల్కొండ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కుందారం శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు గడ్డం రవిలను గౌడ సంఘం నాయకులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు పడాల సత్యనారాయణ గౌడ్‌, అంజగౌడ్‌, రమేష్‌ గౌడ్‌, సైదగర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, సాయగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ముందుండి సేవలందిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -