దాసరి సుధాకర్ ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు 

Congress leaders visited Dasari Sudhakarనవతెలంగాణ – గోవిందరావుపేట 
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు దాసరి సుధాకర్ అనారోగ్యం బారిన పడి హన్మకొండ రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పెండెం శ్రీకాంత్ మాట్లాడుతూ సుధాకర్ త్వరలోనే కోలుకొని గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారని అన్నారు. సుధాకర్ త్వరగా కోలుకోవాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సుధాకర్ ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులలో ములుగు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు జంపాల ప్రభాకర్ ములుగు జిల్లా ఫిషర్్ వైస్ చైర్మన్ పులిగుజ్జు వెంకన్న ములుగు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి జంపాల చంద్రశేఖర్ గోవిందరావుపేట గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వరరావు లు ఉన్నారు.

Spread the love