బాల్క సుమన్ పై యల్ బి నగర్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు

నవతెలంగాణ – హాయత్ నగర్
ఎల్. బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్. బి నగర్ కూడలిలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేసి యల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో బీ ఆర్ ఎస్ నాయకులు ప్రజల సొమ్మును పందికొక్కుల్లా అక్రమంగా తిని ఈరోజు కండ కావరంతో కల్వకుంట్ల బానిస కుక్క  బాల్క సుమన్ సీఎం పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు  తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందన్నారు. వెంటనే బాల్క సుమన్ తన మాటలను వెనక్కి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీ ఆర్ ఎస్ పార్టీని గద్దె దింపినా కూడా బీ ఆర్ ఎస్ నాయకులు బలుపుగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు అసత్య ఆరోపణలు చేస్తే,తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కళ్లెం నరసింహారెడ్డి, మాజీ కోఆప్షన్ మెంబర్ శాలిని, రాష్ట్ర మహిళా నాయకులు శైలజ రెడ్డి, నాగోల్ డివిజన్ అధ్యక్షులు మంజుల రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పుల్లయ్య, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కృపాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, ప్రకాష్, మహిళా నాయకులు రాజేశ్వరి, రజనీరావు, భాను, రాణి, రత్నకుమారి,భాగ్యలక్ష్మి, గిరిజన ఆదివాసి వైస్ చైర్మన్  గాంధీ నాయక్, చందు నాయక్,ప్రకాష్ నాయక్, మైనార్టీ నాయకులు అక్రమ్, యూసఫ్,యూత్ కాంగ్రెస్ నాయకులు యరమల రాంరెడ్డి, వజీర్ నవీన్, ఘంట శ్రవణ్,కర్ణాకర్, రాము,కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love