రోడ్లుపై గుంతలను పూడ్చిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని గుండూరు రోడ్డు, బస్టాండ్ ఆవరణలోని దారులన్ని పెద్ద గుంతలు ఏర్పడాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అస్పత్ వార్ వినోద్ కంకర మిశ్రమంతో ఆ గుంతలను పూడిచ్చారు.  అలాగే పార్లమెంట్ ఎలక్షన్ కారణంగా ఆగిన రోడ్డు, బస్టాండ్ పనులు త్వరలోనే ప్రారంభించడానికి  ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చొరవ తీసుకుంటున్నారని వినోద్ తెలిపారు. వారితోపాటు మాజీ ఎంపీపీ లక్ష్మన్ పటేల్, మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్, అనిల్ సెట్, అస్పత్ వార్ అరుణ్, గాయక్వాడ్ విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love