
నవతెలంగాణ- రెంజల్ : రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డినీ అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని వారు కోరారు. ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చేయూతను అందించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షౌకత్ అలీ, బన్సియా నాయక్, వినోద్, మస్కం మౌనిక, జమాల్, ఆర్లిదాస్, బుడ్డు, ప్రవీణ్, మహబూబ్, తదితరులు పాల్గొన్నారు.