శాంతియుతంగా ఉన్న ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది

– మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కూల్చి వేసిన యువజన భవనం సందర్శన
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
శాంతియుతంగా ఉన్న ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తుంది అని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం సోమవారం, కూల్చి వేసిన యువజన భవనంను సందర్శించారు. యువజన సంఘం భవనం కూల్చి వేత పై గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల మాటలు పట్టుకుని అధికారులు తప్పు చేయడం దారుణం అని అన్నారు.  అధికారులు విచక్షణ కోల్పోయారన్నారు. భవనాన్ని ప్రభుత్వం ఆధీనం లోకి తీసుకుని అధికార కార్యకలాపాలు వినియోగించే అవకాశం ఉంది. శాంతియుతంగా ఉన్న ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తుంది. గ్రామాలలో ప్రభుత్వ భూముల్లో  స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ లను కూల్చేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే అధికార పార్టీ భయానికి లోనవుతున్నారు. కాంగ్రెస్ పాపాలకు ఒడిగడుతుంది అని అన్నారు. యాదగిరిగుట్ట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య మాట్లాడుతూ గతంలో నా మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎమ్మెల్యేకు చెప్పడం ఎమ్మెల్యే అధికారుల మీద ఒత్తిడి తేవడం జరిగింది అన్నారు. ఎంక్వయిరీ కూడా జరిగింది లిఖితపూర్వకంగా కూడా రాసి ఇచ్చాను. నా మీద ఎలాంటి ఆరోపణలు చేశారు వాటిని నిరూపించాలి. 20 గుంటల భూమిని కబ్జా చేశానని, రైతు వేదిక పేరు మీద 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి తీసుకున్నానని, మీటర్ కూడా ప్రభుత్వం పేరు మీదనే ఉందని కంప్లైంట్ చేసినారు. దానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  కూడా విచారణ చేయమని ఆదేశించారని తెలిపారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో బిల్డింగును కూల్చడం సమంజసం కాదు అని అన్నారు. యువత, రైతులు మీటింగు పెట్టుకోవడానికి సొంత నిధులతో కట్టించానని అన్నారు. విచారణలో నాది తప్పు అని తేలితే ప్రభుత్వం స్వాధీన పరచుకోవచ్చునని తెలిపానని అన్నారు. ఇలా కూల్చడం చాలా బాధను కలిగిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, పిఎసిఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్ రెడ్డి, మాజీ ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, బీర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love