కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

– నెల్లికుదురుపట్టణ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య

నవతెలంగాణ- నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు పట్టణ గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ని నిర్వహించారు తెలిపాడు. మండల కేంద్రంలో ఎన్నిక కాబడిన వారికి నియామక పత్రాలను సోమవారం జడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర చేతుల మీదుగా నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు గ్రామ ఉపాధ్యక్షుడిగా హెచ్ రవి ప్రధాన కార్యదర్శిగా ఆకుల నాగన్న సహాయ కార్యదర్శిగా బూరుగుల రజిని కుమార్ మైనార్టీ గ్రామ అధ్యక్షునిగా ఎస్.కె అజ్గార్ అలీ యూత్ కాంగ్రెస్ గ్రామ కార్యదర్శిగా దైద గణేష్ లను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఆహార్నిశలు కృషి చేస్తామని తెలిపారు మా నియామకని సహకరించిన మండల నాయకులకు కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి వారి పల్లి పూర్ణచందర్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సలుగు పూర్ణచందర్ మైనార్టీ మండల అధ్యక్షుడు మౌలానా ఎసి సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుళ్ల ప్రణయ్ కుమార్ సీనియర్ నాయకులు గడ్డం అరుణ్ కుమార్ చట్ల యాకయ్య సలగు హనుమంతు నరేష్ హెచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love