
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలను యూ డైస్ రాష్ట్ర బృందం గురువారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ డైట్ కళాశాల బృందం సభ్యులు నాగమణి పాఠశాలలోని మౌలిక సౌకర్యాలు, యూ డైస్ వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ తెలిపారు. విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల తరగతి గదులు, ఆట స్థలం, టాయిలెట్ సౌకర్యాలు, మినరల్ వాటర్ ఫిల్టర్, ర్యాంప్, వాన నీటిసంరక్షణ పథకం, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానెల్ లు, ఆట వస్తువులు, డిజిటల్ తరగతులు, కృత్రిమ మేధ ఆధారిత బోధన, హెల్త్ చెకప్, కిచెన్ గార్డెన్, సైన్స్ గణిత లాబరేటరీ లను ఆమె పరిశీలించారు. పరిశీలన నివేదికను నిజామాబాద్ జిల్లా విద్యాధికారికి సమర్పిస్తామని ఆమె తెలిపినట్లు ప్రధానో పాధ్యాయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంజయ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.